ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్వారంటైన్ కేంద్రాలుగా నక్షత్రపు హోటళ్లు..! - క్వారంటైన్ కేంద్రాలుగా నక్షత్రపు హోటళ్లు !

విదేశాల నుంచి వచ్చే ప్రవాస భారతీయులను క్వారంటైన్ చేసేందుకు విశాఖలో ఏర్పాట్లు వేగవంతం చేశారు. గల్ఫ్ దేశాలతో పాటు మరికొన్ని దేశాల నుంచి నేరుగా భారతీయులను ఒకవేళ విశాఖ తీసుకువస్తే వెంటనే క్వారంటైన్​కి తరలించే విధంగా చర్యలు చేపట్టారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే క్వారంటైన్ వద్దని వారు భావిస్తే, చెల్లింపు పద్దతిన క్వారంటైన్ చేసేందుకు హోటళ్లను గుర్తించారు.

By

Published : May 16, 2020, 9:56 PM IST

వందే భారత్ కింద విదేశాల్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రత్యేక విమానాలు నడుపుతున్నారు. ప్రస్తుతం చెన్నై, హైదరాబాద్, దిల్లీ, బెంగళూరు విమానాశ్రయాలకు వీరిని చేరుస్తున్నారు. మన రాష్ట్రంలో ఈ తరహా విమానాలు విశాఖకు తర్వాత దశలో వస్తాయని అంచనా. ఒకటి రెండు రోజుల్లో వీటి రాక ఖరారు కానుంది.

ఇందులో వచ్చే ప్రవాస భారతీయలు, ఇతర ప్రయాణికులను వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి ఏ క్వారంటైన్​కి పంపాలన్నది నిర్ణయిస్తారు. వారు కనీసం 14-28 రోజులవరకు క్వారంటైన్ లో ఉండాల్సిన పరిస్ధితి ఉంది. కొవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే కొవిడ్ ఆసుపత్రికి తరలించనున్నారు. క్వారంటైన్ రెండు రకాలుగా ఏర్పాటుచేశారు. ఒకటి ఉచితంగా ప్రభుత్వం ఏర్పాటుచేసే క్వారంటైన్ కేంద్రం కాగా... మరొకటి చెల్లింపు పద్దతిన హోటళ్లలో బస తీసుకోవాల్సిఉంటుంది.

ఇది మూడు నక్షత్రాలు ఆపైన స్ధాయి ఉన్న వాటికి రోజు అద్దె రెండున్నర వేలుగా నిర్ణయించారు. ఇందులో మూడు పూటల ఆహారం కలిపే ఉంటుంది. అంతకన్నా దిగువస్ధాయి హోటళ్లోఅద్దెను 1500గా నిర్ణయించారు. మొత్తం నగరంలో వివిధ హోటళ్లలో 450 గదులను క్వారంటైన్ కోసం వినియోగించుకునేట్టుగా అధికారులు చర్యలు చేపట్టారు.

ఈ క్వారంటైన్ బసలుగా నిర్దేశించిన హోటల్ రూములలో శానిటైజేషన్ ప్రక్రియ నిరంతరాయంగా చేస్తారని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే అంతర్జాతీయ విమాన సర్వీసులలో దిగిన జిల్లాకు చెందిన వారికి ఇక్కడ పరీక్షలు నిర్వహించి వెంటనే క్వారంటైన్​కి తరలిస్తామని జిల్లా అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details