లాక్ డౌన్ నేపథ్యంలో విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం విలాస్ ఖాన్ పాలెంలో రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పర్యటించారు. కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొవిడ్ వ్యాప్తి నివారణకు కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. వీధులన్నీ శుభ్రంగా ఉంచుతూ.. కరోనా వ్యాప్తి కట్టడికి నిరంతరం శ్రమిస్తున్న వారికి మంత్రి పాదాభివందనం చేశారు.
పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి అవంతి పాదాభివందనం - పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి అవంతి పాదాభివందనం
కరోనా వ్యాప్తి కట్టడికి నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి అవంతి శ్రీనివాసరావు పాదాభివందనం చేశారు. విశాఖ జిల్లా విలాస్ ఖాన్ పాలెంలో కార్మికులను శాలువాలతో సత్కరించారు.
పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి అవంతి పాదాభివందనం