లక్షలు విలువ చేసే దొరికిన బంగారాన్ని పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్నారు ఓ ఆటో డ్రైవర్ దంపతులు. విశాఖ జిల్లా నర్సీపట్నం ఏఎస్పీ రిషాంత్‌రెడ్డి కథనం ప్రకారం.. పాయకరావుపేటకు చెందిన కర్రి వీరబాబు, కిరణ్మయి రూ. 2 లక్షల విలువైన బంగారు నక్లెస్‌ను బాగు చేయించడానికి సోమవారం తునిలో దుకాణానికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో పడిపోయింది. దీనికోసం వెతికినప్పటకీ ఫలితం లేక పాయకరావుపేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తునికి చెందిన తుమ్మి విజయబాబు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. సాయంత్రం పాయకరావుపేట నుంచి తుని వెళుతుండగా.. రోడ్డుపక్కన ఇసుకలో పర్స్ కనిపించింది. తీరా చూస్తే నక్లెస్ కనిపించింది. ఈ విషయాన్ని భార్య లోవకుమారికి తెలియపరచగా పోలీసుస్టేషన్‌కు అప్పగించాలని సూచించింది. ఆయన ఆ వస్తువును ఎస్సై విభీషణరావుకి అప్పగించాడు. వెంటనే ఎస్‌ఐ ఏఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం ఆ వస్తువును యజమానికి అప్పగించి, నిజాయతీ చాటుకున్న దంపతులిద్దరినీ సత్కరించారు.
పేదరికంలో ఉన్నా.. నిజాయితీ చాటుకున్న దంపతులు
ఆర్థికంగా పేదవారైనా నిజాయితీలో మాత్రం కోటేశ్వరులని నిరూపించారు ఆటో డ్రైవర్ దంపతులు. తమకు దొరికిన బంగారు ఆభరణాన్ని పోలీసులకు అప్పగించి ఆదర్శంగా నిలిచారు.
నిజాయితీ చాటుకున్న పేద దంపతులు