ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జాతీయ క్రీడ.. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చేరువగా

జాతీయ క్రీడ హాకీని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చేరువ చేసేందుకు క్రీడా విభాగ అధికారులు దృష్టి సారించారు. ఆసక్తి ఉంటే ఏడాది పొడవునా శిక్షణ అందించేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు. హాకీ క్రీడపై విద్యార్థులకు మరింత ఆసక్తి కలిగించేందుకు వేసవి శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

By

Published : Jun 5, 2019, 6:16 PM IST

హాకీ ఆడుతున్న చిన్నారులు

గ్రామీణ కుసుమాలకు హాకీ శిక్షణ

హాకీ నేర్చుకోవాలంటే ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారింది. ఆసక్తి ఉన్నా ఆర్థిక పరిస్థితి బాగాలేక చాలామంది వెనకడుగు వేస్తున్నారు. దీన్ని గుర్తించిన క్రీడాధికారులు హాకీ క్రీడకు సంబంధించిన పరికరాలను ఉచితంగా అందజేసి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. విశాఖ జిల్లా కశింకోటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణా శిబిరానికి మంచి స్పందన లభించింది. వేసవి సెలవులను వృథా చేయకుండా గ్రామీణ ప్రాంత విద్యార్థులు హాకీ నేర్చుకోవడానికి ముందుకు వచ్చారు. వీరిలో ఎక్కువగా బాలికలు ఉండడం విశేషం. అస్ట్రో టాప్ వంటి మైదానాలను అందుబాటులోకి తీసుకువస్తే మరిన్ని ఫలితాలు ఉంటాయని వ్యాయామ ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details