ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ట్రాన్స్​జెండర్ దాతృత్వం.. నిత్యం 300 మందికి అన్నదానం

విశాఖకు చెందిన ట్రాన్స్​జెండర్ మల్లిక... లాక్ డౌన్ సమయంలో పేదలను అదుకునేందుకు ముందుకు వచ్చారు.

hizra in viskaha dst helping poor people due to lockdown
అనాథలను కష్టకాలంలో ఆదుకుంటున్న ట్రాన్స్ జెండర్

By

Published : Apr 29, 2020, 6:34 PM IST

విశాఖకు చెందిన ట్రాన్స్ జెండర్ మల్లిక.. లాక్ డౌన్ కారణంగా తిండి లేక ఇబ్బందులు పడుతున్న వారికి అండగా నిలుస్తున్నారు. కంచర పాలెం ఫ్లై ఓవర్ దిగువన ఉన్న యాచకులు, పేద ప్రజలకు.. నిత్యం ఆహారం అందిస్తున్నారు. తెలిసిన వారి దగ్గర విరాళాలు సేకరిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

విశాఖ కెమిస్ట్స్ అసోసియేషన్... ఈమె చేస్తున్న సేవా కార్యక్రమానికి అండగా నిలిచింది. ఇక్కడ ఉన్న వీధి బాలలకు, నిరాశ్రయమైన కుటుంబాలకు ఆహార సరఫరాకు అవసరమైన సామగ్రి అందించింది. ప్రతి రోజూ 300 మందికి ఆహారం వండి అందిస్తున్నామని మల్లిక చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details