విశాఖ జిల్లాలోని చోడవరం కోర్టును సందర్శించిన హైకోర్టు జడ్జి సీ.ప్రవీణ్ కుమార్కు అధికారులు స్వాగతం పలికారు. గార్డ్ ఆఫ్ ఆనర్ స్వీకరించిన ఆయన.. కోర్టు అవరణలో మొక్కలు నాటారు. అనంతరం పట్టణంలోని స్వయంభూ వినాయకుడిని జస్టిస్ ప్రవీణ్ కుమార్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చోడవరం కోర్టు నుంచి ఆలయానికి హైకోర్టు జడ్జి, విశాఖ జిల్లా జడ్జి హరిహరనాథ్ శర్మ, ఇతర న్యాయ అధికారులు కాలినడకన చేరుకున్నారు.
స్వయంభూ వినాయకుడి సేవలో హైకోర్టు జడ్జి - హైకోర్టు జడ్జి సీ ప్రవీణ్ కుమార్ తాజా న్యూస్
విశాఖ జిల్లా చోడవరం పట్టణంలోని స్వయంభూ వినాయకుడిని జస్టిస్ ప్రవీణ్ కుమార్ దంపతులు దర్శించుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా చోడవరం కోర్టును పరిశీలించారు.
చోడవరం కోర్టును పరిశీలించిన హైకోర్టు జడ్జి