విశాఖ రుషికొండ తవ్వకాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు - విశాఖ రుషికొండ తవ్వకాలు
12:11 November 03
రుషికొండపై సర్వే చేయాలని సర్వే బృందానికి హైకోర్టు ఆదేశం
విశాఖ రుషికొండ తవ్వకాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రుషికొండపై సర్వే చేయాలని సర్వే చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అధికారుల బృందాన్ని ధర్మాసనం ఆదేశించింది. అనుమతికి మించి ఎంతమేర తవ్వకాలు జరిపారో,... అనుమతికి మించి ఎంతమేర భవనాలు నిర్మిస్తున్నారో సర్వే చేయాలని తెలిపింది. సర్వే నివేదికలను హైకోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 14కు హైకోర్టు వాయిదా వేసింది.
ఇవీ చదవండి: