ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

DOCTOR SUDHAKAR CASE: నివేదికను అమికస్ క్యూరీకి తప్ప ఇంకెవరికీ ఇవ్వబోమన్న హైకోర్టు - ap latest news

డాక్టర్ సుధాకర్​(Doctor Sudhakar) విషయంలో దాఖలు చేసిన తుది నివేదికను తనకు ఇవ్వాలంటూ ప్రభుత్వం తరఫున ప్రత్యేక సీనియర్ కౌన్సెల్ ఎస్ఎస్ ప్రసాద్ కోరగా... ఈ దశలో అమికస్ క్యూరీకి తప్ప ఇతరులకు నివేదిక ఇవ్వబోమని ధర్మాసనం తెలిపింది.

HIGH COURT COMMENTS ON DOCTOR SUDHAKAR CASE ISSUE
నివేదికను అమికస్ క్యూరీకి తప్ప ఇంకెవరికీ ఇవ్వబోమన్న హైకోర్టు

By

Published : Sep 1, 2021, 9:07 AM IST

విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి మత్తు వైద్య నిపుణుడు డాక్టర్ కె. సుధాకర్ విషయంలో దాఖలు చేసిన తుది నివేదికను అమికస్ క్యూరీ, సీనియర్ న్యాయవాది పి. వీరా రెడ్డికి అందజేయడానికి అభ్యంతరం లేదని సీబీఐ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. అమికస్ క్యూరీకి నివేదిక దస్త్రాన్ని అందజేయాలని సీబీఐని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్. జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. డాక్టర్ కె. సుధాకర్‌తో విశాఖ పోలీసులు వ్యవహరించిన తీరుపై వీడియో క్లిప్పింగ్​ను జత చేస్తూ.. తెదేపా మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత రాసిన లేఖను హైకోర్టు సుమోటో పిల్​గా పరిగణించి... విచారణ జరిపి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే.

అమికస్ క్యూరీకి తప్ప ఇంకెవరికీ ఇవ్వం..

విచారణలో సీబీఐ నివేదికను తనకు అందజేస్తే... కోర్టు విచారణకు సహకరించేందుకు వీలుగా ఉంటుందని అమికస్ క్యూరీ పేర్కొన్నారు. సీబీఐ తరఫు న్యాయవాది చెన్న కేశవులు ఇచ్చేందుకు అభ్యంతరం లేదన్నారు. నివేదికలోని అంశాలు వెల్లడి కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తరఫున ప్రత్యేక సీనియర్ కౌన్సెల్ ఎస్ఎస్ ప్రసాద్ సీబీఐ నివేదిక తనకు అందజేయాలని కోరగా ఈ దశలో అమికస్ క్యూరీకి తప్ప ఇతరులకు ఇవ్వబోమని ధర్మాసనం తెలిపింది.

ఇదీ చూడండి:అన్నకుటుంబంపై తమ్ముడు కత్తులతో దాడి.. ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details