ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వర్షాలకు చోడవరంలో నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, చెట్లు

విశాఖ జిల్లాలో పలుప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. చోడవరంలో వానలకు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. అధికారులు రోడ్ల మీద పడిఉన్న చెట్లను తొలగిస్తున్నారు.

heavy rains in chodavaram
చోడవరంలో వర్షం

By

Published : Oct 13, 2020, 5:35 PM IST

విశాఖ జిల్లా చోడవరంలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఏపీఈపీడీసీఎల్ చోడవరం కార్యాలయ పరిధిలో నాలుగు విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్లు దెబ్బతిన్నాయి. 10 వరకు స్తంభాలు పడిపోయాయి. చోడవరంలో 10 గంటల పాటు విద్యుత్ సరఫరా లేదు.

దాదాపు రూ. 1.50 లక్షల నష్టం కలిగింది. బీఎన్ దారిలో మారకమ్మరేవు వద్ద భారీ మర్రిచెట్టు కూలింది. పాడేరు, నర్సీపట్నం, చోడవరానికి రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలతో ఇటుకల బట్టీల యజమానులు లబోదిబోమంటున్నారు. ఇటుకలు, ముడి సరకు తడిసిపోయిందన్నారు.

ABOUT THE AUTHOR

...view details