విశాఖలోని పాయకరావుపేటలో భారీ వర్షం కురిసింది.రోడ్లన్ని జలమయమయ్యాయి.రహదారులపై నీరు నిలిచిపోవటంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.పలుచోట్ల ప్రధాన కూడళ్లలో వర్షపు నీరు నిలిచిపోయింది.రైతులు మాత్రం ఈ వర్షాలతో మేలు జరుగుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.లింగాల కాలనీ,ఇందిరా కాలనీ తదితర ప్రాంతాల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో,వర్షం నీరు నిలిచే ఉంటుందని..దీని వల్ల దోమల బెడద పెరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాయకరావుపేటలో భారీ వర్షం..
విశాఖపట్నం పాయకరావుపేటలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో,నిలిచి ఉన్న నీటితో దోమల బెడద పెరిగే అవకాశం ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాయకరావుపేటలో భారీ వర్షం..రోడ్లన్ని జలమయం