విశాఖ అతిథి గృహంపై సమాధానం ఇవ్వండి: హైకోర్టు
11:10 August 27
విశాఖ అతిథి గృహంపై సమాధానం ఇవ్వండి: హైకోర్టు
విశాఖలో అతిథి గృహంనిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో విచారణ జరిగింది. సెప్టెంబర్ 10లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్ట్ ఆదేశించింది. అతిథి గృహం నిర్మాణంపై న్యాయవాది నితీశ్ గుప్తా ఉన్నత న్యాయస్థానంలో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయగా... హైకోర్టు విచారించింది. రాష్ట్రపతి భవన్ 5 ఎకరాల్లో ఉండగా 30 ఎకరాల్లో అతిథిగృహం నిర్మాణమేంటని... స్టేటస్ కో ఉన్నప్పుడు అతిథిగృహ నిర్మాణానికి శంకుస్థాపన ఏంటని పిటిషనర్ వాదించారు. ఇది కార్యనిర్వాహక రాజధాని తరలింపులో భాగమేనని కోర్టుకు విన్నవించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం... కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 21కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: