ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ తెదేపా కార్యాలయానికి నోటీసులు! - జీవీఎంసీ

నిన్నటివరకు విశాఖలో తెదేపా నాయకుల ఆస్తులపై విరుచుకుపడిన ప్రభుత్వం దూకుడు పెంచింది. జీవీఎంసీ నోటీసుల పర్వంతో విజృభిస్తోంది. ఈ సారి విశాఖ తెదేపా కార్యాలయానికి నోటీసులు పంపింది.

gvmc_sent_notices_to_vishakapatnam_district_tdp_office

By

Published : Jun 30, 2019, 5:48 PM IST

Updated : Jun 30, 2019, 7:50 PM IST

విశాఖ జిల్లా తెలుగుదేశం కార్యాలయం అక్రమ నిర్మాణమని మహా విశాఖ నగర పాలక సంస్థ జోన్-3 నుంచి టౌన్ ప్లానింగ్ అధికారి స్వీయ సంతకంతో తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడికి నోటీసులు పంపించారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ 452(2) నిబంధనల కింద నోటీసు అందించినట్టు నోటీసులో పొందుపరిచారు.

ఏడు రోజుల్లో వివరణకు గడువు ఇచ్చినట్లు.. లేనిపక్షంలో జీవీఎంసీ చర్యలు తీసుకుంటుందని నోటీసులో పేర్కొన్నారు. విశాఖ తెదేపా కార్యాలయానికి నోటీసులు పంపడంపై జిల్లా ఇన్​ఛార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమ నిర్మాణాలపై ఒకే వైఖరితో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు వైకాపా ప్రభుత్వం పోవడం లేదని సమాధానమిచ్చారు.

అక్రమ నిర్మాణాలపై ఒకే వైఖరి
Last Updated : Jun 30, 2019, 7:50 PM IST

ABOUT THE AUTHOR

...view details