భీమిలి పూర్వ తహసీల్దార్ రామారావుకు చెందిన ఆస్తుల స్వాధీనానికి... విశాఖ అనిశా ప్రత్యేక కోర్టు ఆదేశాలిచ్చింది. అనిశా 2016 చట్టం ప్రకారం ఆస్తుల స్వాధీనానికి ఆదేశాలు జారీ చేసింది. రూ.60 కోట్ల రామారావు ఆస్తులను ప్రభుత్వ పరం చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. రామారావుకు సంబంధించిన ఆస్తుల్లో కోట్ల విలువైన బంగారం, స్థిరాస్తులున్నాయి.
రామారావు ఆస్తులు ప్రభుత్వ పరం..!! - భీమిలి
భీమిలి పూర్వ తహసీల్దార్ రామారావు ఆస్తుల స్వాధీనం చేయాలని... అనిశా ప్రత్యేక కోర్టు ఆదేశాలిచ్చింది. 2016 చట్టం ప్రకారం ఆస్తుల స్వాధీనానికి ఆదేశాలు జారీ చేసింది.
2017లో రామారావు ఇంట్లో అనిశా దాడులు జరిగాయి. ఈ దాడుల్లో స్థిర, చరాస్తుల వివరాలు భారీగా పట్టుబడ్డాయి. రామారావుతో పాటు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు అల్లుళ్ల పేరిట ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని రామారావుపై అనిశా అధికారులు కేసు నమోదు చేశారు. అనిశా సమర్పించిన నివేదిక ఆధారంగా ఆస్తుల స్వాధీనానికి కోర్టు ఆదేశమిచ్చింది. ఆస్తులను ప్రభుత్వ పరం చేసుకోవడం ఇదే తొలిసారని... అనిశా డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ చెప్పారు.