విశాఖ జిల్లా మాడుగులలో మంగళవారం శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచే కాకుండా తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల నుంచి వేలసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రతి ఏడాది జూన్ నెలలో ఈ జాతరను నిర్వహించటం అనవాయితీగా వస్తోంది. భక్తులు పెద్ద సంఖ్యంలో పాల్గొని... ఘటాలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అనకాపల్లి డి.ఎస్.పి ప్రసాదరావు, మాడుగుల ఎస్ఐ తారకేశ్వర్ ఆధ్వర్యంలో 250 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
కన్నుల పండువగా.. మోదకొండమ్మ అమ్మవారి జాతర
ఉత్తరాంధ్రలో పేరొందిన మాడుగుల శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర కన్నుల పండువగా జరిగింది. కొన్ని వేల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు.
'కన్నుల పండువగా శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర'