విశాఖలోని జగదాంబ జంక్షన్లో ఓ మహిళ బంగారు ఆభరణాలను పోగొట్టుకున్న కేసును పోలీసులు ఛేదించారు. రాత్రివేళ కారులో ప్రయాణిస్తూ జగదాంబ జంక్షన్ వద్ద బంగారు నగలు పోగొట్టుకున్నానని ఓ మహిళ, భర్తతో కలిసి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా కూడలిలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. ఓ ఆటో డ్రైవర్ నగల బ్యాగును తీసుకున్నట్లు నిర్ధారించుకుని అతన్ని విచారించారు. మరోడ్రైవర్తో కలిసి ఆభరణాలను పంచుకున్నట్లు నిందితుడు అంగీకరించాడు. అతని నుంచి మొత్తం 235 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుని బాధితురాలికి అప్పగించారు. ఇద్దరు ఆటో డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
బంగారు నగలు పోగొట్టుకున్న మహిళ..నిఘా నేత్రాల సాయంతో గుర్తింపు
జగదాంబ జంక్షన్లో ఓ మహిళ బంగారు అభరణాలను పోగొట్టుకుంది. దాంతో ఆమె స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాల ఆధారంగా ఆటో డ్రైవర్‌కు నగలు దొరికినట్లు పోలీసులు గుర్తించారు. అతని నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకుని బాధితురాలికి అప్పగించారు. అతనితోపాటు మరో ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
బంగారు నగల గుట్టు విప్పిన నిఘా నేత్రాలు