విశాఖ జిల్లా భీమునిపట్నంలో పురాతన ఆలయం శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవాలయం ఘాట్ రోడ్డు మార్గానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. కరోనా నుంచి కోలుకున్న మంత్రి... ఇవాళ ఉదయం సింహాచలం అప్పన్నస్వామిని దర్శించుకొని నేరుగా భీమునిపట్నం చేరుకున్నారు. శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ అర్చకులు శింగనాచార్యులు.. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం 75లక్షల వ్యయంతో నిర్మించనున్న ఆలయ ఘూట్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే ఈ నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ.75 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో డైట్ కళాశాల నుంచి నృసింహస్వామి ఆలయం వరకు రోడ్డు మార్గం నిర్మించనున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోడ్డుమార్గం మంత్రి అవంతి చొరవతో నెరవేరడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.
శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవాలయం ఘాట్ రోడ్డుకు మంత్రి శంకుస్థాపన - Bheemunipatnam temple latest news
భీమునిపట్నంలో పురాతన ఆలయం శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవాలయం ఘాట్ రోడ్డు మార్గానికి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణానికి రూ.75 లక్షలు మంజూరయ్యాయి. డైట్ కళాశాల నుంచి నృసింహస్వామి ఆలయం వరకు రోడ్డుమార్గం నిర్మించనున్నారు.
శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవాలయం ఘాట్ రోడ్డుకు మంత్రి శంకుస్థాపన