ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గతంలో జరిగిన అవకతవకలపై విచారణ కొనసాగుతోంది: గౌతంరెడ్డి - విశాఖపట్నం తాజా వార్తలు

రాష్ట్రంలో మారుమూల ప్రాంతానికి కూడా ఏపీ ఫైబర్ నెట్ ద్వారా అనుసంధానించాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యం అని ఏపీ ఫైబర్ నెట్ సంస్థ ఛైర్మన్ గౌతంరెడ్డి తెలిపారు. అనుగుణంగా తాము వేగంగా పనులన్నీంటిని చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. విశాఖలోని ప్రధాన కార్యాలయాన్ని అక్కడ ఉన్న సాంకేతిక అంశాలను పరిశీలించారు.

గౌతంరెడ్డి
గౌతంరెడ్డి

By

Published : Sep 18, 2021, 7:52 PM IST

రాష్ట్రంలో మారుమూల ప్రాంతానికి కూడా ఏపీ ఫైబర్ నెట్ ద్వారా అనుసంధానించాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యం అని ఏపీ ఫైబర్ నెట్ సంస్థ ఛైర్మన్ గౌతంరెడ్డి తెలిపారు. అనుగుణంగా తాము వేగంగా పనులన్నీంటిని చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. విశాఖలోని ప్రధాన కార్యాలయాన్ని అక్కడ ఉన్న సాంకేతిక అంశాలను పరిశీలించారు. అధునాతన సాంకేతిక పరికరాలను సమకూర్చుకునేందుకు చేస్తున్న యత్నాలను ఆధికారులు ఆయనకు వివరించారు.

తక్కువ ధరలో అన్ని ప్రాంతాలకు ఇళ్లకు ఫైబర్ ద్వారా అనుసంధానించడం వల్ల సమాచార రంగం నుంచి పొందాల్సిన ప్రయోజనాలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవలకపై విచారణ ముమ్మరంగా సాగుతోందని, బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు, అరెస్టులు యధావిధిగా ఉంటాయని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

Kishan reddy: తితిదే బోర్డుకు నేను ఎవరినీ సిఫారసు చేయలేదు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

ABOUT THE AUTHOR

...view details