రాష్ట్రంలో తెలుగుదేశం విజయం ఖాయమైపోయిందని మంత్రి గంటా శ్రీనివాసరావువిశాఖలోఅభిప్రాయపడ్డారు. 125 శాసనసభ నియోజకవర్గాల్లో గెలుపు జెండాను ఎగరేస్తామన్న ఆయన... మహిళలు అర్థరాత్రి వరకూ వేచి ఉండి ఓటువేయడం వజయానికి సూచికగా గుర్తిస్తామన్నారు. పోలింగ్ రోజున ఓటర్ల స్పందన ప్రజాస్వామ్యంపై వారికున్న నిబద్ధతకు నిదర్శనమని అభినందించారు. పోలింగ్ కేంద్రాల్లో 20 నుంచి 30 శాతం వరకూ ఈవీఎంలు ప్రారంభంలో పనిచేయలేదన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 37వ వార్డు 209 బూత్‌లో అర్థరాత్రి 2 గంటలవరకూ ఓటింగ్ జరిగిందని గంటా తెలిపారు.
'ఓటర్ల స్పందనే తేదెపా గెలుపునకు నిదర్శనం'
పోలింగ్ రోజున ఓటర్ల స్పందన ప్రజాస్వామ్యంపై వారి బాధ్యతకు నిదర్శనమని గంటా శ్రీనివాసరావు అభినందించారు. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో తెదేపా 125 శాసనసభ నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
గంటా శ్రీనివాసరావు