ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ ఉత్తరంలో నా గెలుపు ఖాయం : గంటా

ప్రతి పక్షనేత ఎన్నికల తర్వాత ఇంటికి వెళ్లి ఫ్యాన్ వేసుకుని గ్లాసులో టీ లేదా కాఫీ తాగుతూ కూర్చుంటారు...అఫిడవిట్ లో కేసుల వివరాలు రెండు లేదా ముూడు పేజీలుంటాయి....జగన్ కు 25 పేజీలున్నాయి - గంటా శ్రీనివాసరావు

By

Published : Apr 5, 2019, 7:38 AM IST

గంటా శ్రీనివాసరావు

గంటా శ్రీనివాసరావు
ప్రతి పక్షనేత ఎన్నికల తర్వాత ఇంటికి వెళ్లి ఫ్యాన్ వేసుకుని గ్లాసులో టీ లేదా కాఫీ తాగుతారిని మంత్రి గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. ఎన్నికల సంఘానికి సమర్పించే అఫిడవిట్ లో కేసుల వివరాలు రెండు లేదా ముూడు పేజీలుంటాయని.. జగన్ కు 25 పేజీలున్నాయన్నారు. విశాఖ లో ఉత్తర నియోజక వర్గ అభివృద్ధి ప్రణాళిక.. 9 పేజీల విజన్ డాక్యుమెంట్ ను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. విద్య, వైద్య, మౌలిక సదుపాయాలుకు పెద్ద పీట వేస్తూ ప్రణాళిక రూపొందించారని తెలిపారు. విశాఖ ఉత్తరంలో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 2014లో భాజపాతో పొత్తు పెట్టుకుని తెదేపా ఎంతో నష్టపోయిందన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్డీఏలో కలిస్తే రాష్ట్రాన్ని మోసం చేశారన్నారు. కేసీఆర్ ఆంధ్రులను అవమాన పరుస్తున్నారని మండిపడ్డారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details