ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాహన తనిఖీల్లో 302 కిలోల గంజాయి పట్టివేత - visakha district updates

విశాఖ జిల్లాలో ఆక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి.. వారి వద్ద నుంచి 302 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ganjai seized
గంజాయి పట్టివేత

By

Published : May 4, 2021, 8:47 AM IST

విశాఖ జిల్లా గొలుగొండ మండలం ఏఎల్​పురంలో వాహన తనిఖీల్లో 302 కిలోల గంజాయిని.. కృష్ణదేవిపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ ఏజెన్సీ దారకొండ ప్రాంతం నుంచి గోనె సంచులలో నింపిన గంజాయిని హైదరాబాదు తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మహారాష్ట్రకు చెందిన సలీం, హైదరాబాద్​కు చెందిన విక్రమ్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి.. వారి నుంచి రెండు చరవాణీలతో పాటు రూ. 2,560 నగదును స్వాధీనం చేసుకున్నారు. విశాఖ మన్యంలో గంజాయి ఆక్రమ రవాణా వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details