పెట్రోల్ ట్యాంకర్లో గంజాయిని రవాణా చేస్తున్న వ్యక్తిని విశాఖ మన్యం పోలీసులు పట్టుకున్నారు. కొయ్యూరు మండలం మర్రిపాలెం చెక్‌పోస్టు వద్ద తనిఖీ చేస్తుండగా.. పెట్రోల్ ట్యాంకర్లో గంజాయిని గుర్తించారు.
ట్యాంకర్లో సుమారు ఐదు వందల కిలోల గంజాయి పట్టుబడిందని పోలీసులు తెలిపారు. వాహనాన్ని రాజస్థాన్ రాష్ట్రానికి చెందినదిగా తెలిపారు. డ్రైవర్‌ను అరెస్టు చేశారు.