గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఒడిశా పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్న గంజాయి సాగు పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. సరిహద్దులోని మాచ్‌ఖండ్ సమీపంలోని జయంతిగిరి అటవీ ప్రాంతంలో ఆబ్కారీ శాఖ సిబ్బంది కలసి పోలీసులు దాడులు నిర్వహించారు. నందపూర్ ఎస్డీపీఓ సంజయ్ మహపాత్రో నేతృత్వంలో 40 ఎకరాల్లో గంజాయి మొక్కలను ధ్వసం చేశారు.
గిరిజనులు అత్యంత మారుమూల అటవీ ప్రదేశాల్లో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి సాగు చేస్తుండడంతో.. పూర్తి కట్టుదిట్టమైన భద్రత మధ్య గంజాయి సాగు ధ్వంసం కార్యక్రమం కొనసాగింది. లమతపుట్, నందపూర్ మండలాల్లో ఇప్పటివరకు 9 చోట్ల 1174 ఎకరాల్లో గంజాయి సాగును కాల్చివేసి నట్టు పోలీసులు తెలిపారు. ఇవాళ ఒక్కరోజే దాదాపు రూ. 4 కోట్ల విలువ చేసే గంజాయిని కాల్చేశామన్నారు.