విశాఖ నగరంలో పలు వాహనాలు దొంగిలించి.. రీ మోడల్ చేసి అమ్ముతున్న 10 మంది దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 76 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు.
ARREST: ద్విచక్రవాహనాల చోరీ ముఠా అరెస్ట్.. 76 బైక్లు స్వాధీనం - విశాఖ జిల్లా తాజా సమాచారం
విశాఖ జిల్లాలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 76 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ముఠాను పట్టుకున్న పోలీసు సిబ్బందిని పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా అభినందించారు.
నగరానికి చెందిన 10 మంది సెకండ్ హ్యాండ్ విడిభాగాలు అమ్మే వ్యక్తులు, మెకానిక్లు ఒక ముఠాగా ఏర్పడ్డారు. నగరంలోని పాత వాహనాలు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో, రోడ్లపై పార్కింగ్ చేసి ఉన్న ద్విచక్రవాహనాలను మారు తాళాలతో దొంగిలించి.. వాటి ఇంజన్ల చాసిస్ నెంబర్, నెంబర్ ప్లేట్ మార్చి ఇతరులకు అమ్మేసేవారని పోలీసులు తెలిపారు. నగరానికి చెందిన మురళీకృష్ణ అనే వ్యక్తి తన ద్విచక్రవాహనం పోయిందని ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు.. చిన్న క్లూ దొరకడంతో దాని ఆధారంగా ఈ ముఠా గుట్టును రట్టు చేశారు. బైక్లు దొంగిలిస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసు సిబ్బందిని పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా అభినందించారు.
ఇదీ చదవండి