ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ గణపతి ప్రత్యేకం..మహిళలదే అగ్రస్థానం - chodavaram

వినాయక నవరాత్రి ఉత్సవాలు అంటే ఆబాలగోపాలం సరదగా పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతనతో ఆనందంగా గడుపుతారు. అయితే విశాఖ జిల్లా చోడవరంలోని కొనాం అతిధి గృహం వద్ద ఓ ప్రత్యేకత ఉంది. మహిళలలే నవరాత్రులు జరుపుతారు. చందాలు వసూలు చేయడం నుంచి నిమజ్జనం వరకు వనితలే అన్నీ చూసుకుంటారు.

ఈ గణపతి మహిళలకు మాత్రమే....

By

Published : Sep 7, 2019, 4:38 PM IST

ఈ గణపతి మహిళలకు మాత్రమే....

వినాయక చవితి ముందు నుంచి కుర్రాళ్లు చేసే హడావిడి అంతా ఇంతా ఉండదు. చందాల నుంచి నిమజ్జనం వరకు వాళ్లదే హడావిడి... అయితే విశాఖ జిల్లా చోడవరంలోని కొనాం అతిథి గృహంలో పండగంతా మహిళలదే... వినాయక చవితి నవరాత్రులు మొత్తం వారే జరుపుతారు.

ఒకటా రెండా ఏకంగా 18 ఏళ్లుగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుతుండటం ఈ మహిళల ప్రత్యేకత. కుల, మతాలకు ఆతీతంగా వారు ఉత్సవాలు జరుపుతున్నారు. ఇంటింటికి వెళ్లి అందర్నీ పూజలకు ఆహ్వానిస్తారు. ఈ తొమ్మిది రోజులు ఏదో ఒక సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వయస్సుతో సంబంధం లేకుండా ఆటలపోటీలు నిర్వహిస్తారు. వినాయకుని నిమజ్జనం వేడుకను ఊరిగేంపుతో ముగిస్తారు. అందరూ కుటుంబాలతో సహా వచ్చి అఖరిరోజు భోజనాలు చేస్తారు. తొమ్మిది రోజులు సందడిగా సాగుతుంది. ఈ ఉత్సవాలు తమ మధ్య ఐక్యతను చాటుతున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details