ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'హోటళ్లు, రెస్టారెంట్లపై విజిలెన్స్ దాడులు'

రాష్ట్రంలోని పలు పట్టణాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ప్రమాణాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న విజిలెన్స్ అధికారుల తనిఖీలు'

By

Published : Apr 29, 2019, 7:59 PM IST

హెటళ్లు, రెస్టారెంట్ల పై విజిలెన్స్ తనిఖీలు
విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లోని హోటల్స్ పై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. అనకాపల్లిలోని బృందావన్, రెడ్ చెర్రీ హోటళ్లు పైన, నర్సీపట్నంలోని పలు రెస్టారెంట్లు పైన అధికారులు తనిఖీలు నిర్వహించారు.

నిల్వ పదార్థాలతో వంటకాలు
నిల్వ ఉంచిన ఆహార పదార్ధాలను, రంగు కలిపిన ఆహార పదార్థాలను డీఎస్పీ శ్రావణి, పుడ్ ఇన్​స్పెక్టర్​ వెంకటరత్నం పరిశీలించి...వాటిని సీజ్ చేసి లేబరేటరీకి పంపారు. విశాఖ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో హోటల్స్ పై విజిలెన్స్ తనిఖీలు చేపట్టి... నిర్వహణ సరిగా చేపట్టని యజమానులపై చర్యలు తీసుకుంటున్నట్లు శ్రావణి వివరించారు.

ఐస్ క్రీం తయారీలో కొరవడిన నాణ్యత
ఐస్‌క్రీంల తయారీలో నిబంధనలకు పాతరేసి ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నట్లు ఆహార కల్తీ నిరోధక విభాగం అధికారులు విజయవాడలో గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్‌ సేఫ్టీ, విజిలెన్స్‌, తూనికలు కొలతల శాఖల అధికారులు సంయుక్తంగా దాడులు కొనసాగిస్తున్నారు. ఇవాళ విజయవాడ నగర శివారులోని పోరంకి, నిడమానూరుల వద్ద రెండు ఐస్‌క్రీం తయారీ ప్లాంట్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అపరిశుభ్ర వాతావరణం, ప్రమాణాలు అతిక్రమించి రంగులు వాడటం, ప్లాంట్‌ నిర్వహణకు అనుమతి లేకపోవటం వంటి పలు లోపాలను గుర్తించారు. రెండు ప్లాంట్ల నుంచి నమూనాలు సేకరించి... వాటిని ప్రయోగశాలలకు పంపారు. నివేదికలు వచ్చిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి...భారీగా గంజాయి పట్టివేత

ABOUT THE AUTHOR

...view details