ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు మనీలా, అబుదాబి నుంచి విశాఖకు రానున్న ఆంధ్రులు - విశాఖకు రానున్న భారతీయులు

లాక్ డౌన్ కారణంగా మనీలా, అబుదాబిలో చిక్కుకుపోయిన విశాఖ వాసులు.. నేడు నగరానికి చేరుకోనున్నారు. ప్రత్యేక విమానాంలో ఈరోజు రాత్రి వారు విశాఖలో దిగనున్నారు.

flight will come to vizag from manila and abudaabi
విశాఖ విమానాశ్రయం

By

Published : May 19, 2020, 12:07 PM IST

లాక్ డౌన్ కారణంగా ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకుని నేడు విశాఖ విమానాశ్రయానికి ప్రత్యేక విమానం రానుంది. మనీలా, అబుదాబి నుంచి 320 మంది ప్రయాణికులు వస్తున్నట్లు విమానాశ్రయ డైరెక్టర్‌ రాజకిశోర్‌ తెలిపారు.

మనీలా నుంచి తొలిసారిగా పెద్ద విమానం (వైడ్‌ బాడీ) రానుంది. ఇందులో వచ్చిన 230 మంది ముంబయిలో దిగనుండగా.. మరో 170 మంది విశాఖకు రానున్నారు. ఆ విమానం ఈరోజు రాత్రి 8.30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి వస్తుంది. అలాగే అబుదాబి నుంచి 150 మంది ప్రయాణికులు రాత్రి 8.45కు రానున్నారు.

ABOUT THE AUTHOR

...view details