ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చమురు నౌకలో అగ్ని ప్రమాదం... మంటలు ఆర్పిన సహ్యాద్రి

శ్రీలంక తీరంలో ఎమ్‌టీ న్యూ డైమండ్‌ అనే నౌక ప్రమాదానికి గురైంది. ఈ నౌక కువైట్ నుంచి భారీ చమురు నిల్వలతో శ్రీలంక మీదుగా భారత్​కు వస్తోంది. ఈక్రమంలో అగ్నిప్రమాదం బారినపడింది.

Fire hazard on oil ship in bengal bay
చమురు నౌకలో అగ్ని ప్రమాదం

By

Published : Sep 5, 2020, 9:01 AM IST

Updated : Sep 5, 2020, 12:54 PM IST

రెండు రోజుల క్రితం ప్రమాదానికి గురైన భారత్​కు చెందిన ఓ చముర నౌకలో మంటలు అదుపులోకి వచ్చాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్​కు గల్ఫ్​ నుంచి క్రూడాయిల్ తీసుకువచ్చే నౌక ప్రమాదం బారిన పడింది. ఎంటీ న్యూ డైమండ్ అనే నౌక భారీ చమురు నిల్వలతో శ్రీలంక మీదుగా భారత్ ​వస్తోంది. ఈ క్రమంలోనే శ్రీలంక తీరంలో మూడో తేదీన ఈ దుర్ఘటన జరిగింది. అప్పటి నుంచి మంటలు ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.

చమురు నౌకలో అగ్ని ప్రమాదం

ప్రమాద విషయాన్ని తెలుసుకున్న కోస్ట్​గార్డు.... భారత్​ నౌకా దళ యుద్ధ నౌక సహ్యాద్రిని పంపించి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతానికి నౌకలోని మంటలు పూర్తి ఆరిపోయాయని అధికారులు ధ్రువీకరించారు. అయితే ఆ నౌక ప్రయాణానికి అనువుగా ఉందా లేదా అన్నది పరిశీలించిన తర్వాత నిర్దరించానున్నారు.

చముర నౌకలో మంటలు ఆర్పేందుకు ఇతర దేశాల నౌకలు కూడా సహకారం అందించాయని అధికారులు తెలిపారు. నౌకలో ఉన్న 22 మంది సిబ్బందిని నేవీ సిబ్బంది రక్షించారు. నౌక కువైట్ నుంచి భారత్‌కు వస్తుండగా శ్రీలంక తీరంలో ఈ ప్రమాదం జరిగింది.

ఇదీ చదవండి:సరిహద్దులో ట్యాంకుల 'రణ'గొణ ధ్వనులు!

Last Updated : Sep 5, 2020, 12:54 PM IST

ABOUT THE AUTHOR

...view details