fire accident: విశాఖ జిల్లా వెంకటాపురంలో అగ్ని ప్రమాదం - విశాఖ జిల్లా నేర వార్తలు
00:49 February 14
ఫార్మా కంపెనీల వ్యర్థాలు నిల్వ వుంచిన స్టాక్ యార్డ్ అగ్నికి ఆహుతి
fire accident: విశాఖ జిల్లా మునగపాక మండలం వెంకటాపురం సమీపంలో ఆదివారం అర్థరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఫార్మా కంపెనీలకు సంబంధించిన స్క్రాబ్ నిల్వఉంచిన ప్రదేశంలో పెద్ద ఎత్తున మంటల చేలరేగాయి. ఇక్కడ ఎకరా స్థలంలో ప్లాస్టిక్ సామాగ్రితో పాటు ఇతర సామాగ్రి క్రయ విక్రయాలు జరుపుతారు. అయితే అర్థరాత్రి సమయంలో అనుకోకుండా మంటలు చేలరేగటంతో ఆ ప్రాంతమంతా పొల అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఆస్తి నష్టం అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: