విశాఖ జిల్లా కైలాసపురం కొండపై మంటలు చెలరేగాయి. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎండాకాలం కావడంతో మంటలు త్వరగా వ్యాపించాయి. గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
కైలాసపురం కొండపై మంటలు - fire accident in vishakhapatnam
విశాఖలోని కైలాసపురం కొండపై ఉన్న అడవిలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు. ఎవరో నిప్పుపెట్టి ఉంటారని పోలీసులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కైలాసపురం కొండపై అగ్నిప్రమాదం