విశాఖ ఆంధ్ర విశ్వ విద్యాలయంలోని పవర్ సప్లై యూనిట్ బాక్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అగ్ని నియంత్రణ సిలిండర్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మధ్యాహ్న సమయంలో పెద్ద శబ్దంతో మంటలు వ్యాపించినట్లు సిబ్బంది చెప్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ఈ ప్రమాదంతో యూనివర్శిటీలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఏయూలో అగ్నిప్రమాదం.. విద్యుత్ సరఫరాకు అంతరాయం - ఆంధ్ర విశ్వవిద్యాలయం
విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని పవర్ సప్లై యూనిట్ బాక్సులో మంటలు చెలరేగాయి. మధ్యాహ్న సమయంలో పెద్ద శబ్దంతో మంటలు వ్యాపించినట్లు సిబ్బంది చెప్పారు.
ఏయూలో అగ్నిప్రమాదం.. విద్యుత్ సరఫరాకు అంతరాయం