ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొండ గెడ్డ కాలువ ఆక్రమణపై రైతుల ఆగ్రహం - visakhapatnam district crime news in telugu

వైకాపా నాయకుడు ఒకరు విశాఖ జిల్లా సీతారాంపురంలోని కొండ గెడ్డ కాలువను చదును చేసి తన భూములలో కలుపుకున్నాడు. ఈ విషయంపై ఆగ్రహించిన రైతులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి కాలువను పునరుద్ధరించాలని వేడుకున్నారు.

కొండగెడ్డ కాలువ ఆక్రమణపై స్థానిక రైతుల ఆగ్రహం
కొండగెడ్డ కాలువ ఆక్రమణపై స్థానిక రైతుల ఆగ్రహం

By

Published : Jun 18, 2020, 7:09 PM IST


విశాఖ జిల్లా సీతారాంపురంలో కొండ గెడ్డ కాలువ ఆక్రమణపై స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామానికి చెందిన ఓ వైకాపా నాయకుడు కొండ నుంచి చెరువుకు వచ్చే కాలువను చదును చేసి.... తన భూములలో కలుపుకున్నాడు. ఈ విషయమై స్థానిక రైతులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు కాలువ ఆక్రమణకు గురయినట్లు గుర్తించారు. కాలువ ద్వారా సుమారు వంద ఎకరాల భూములకు గతంలో నీరు అందేదని రైతులు తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి కాలువను పునరుద్ధరించాలని రైతులు కోరారు. వాటితో పాటు సమీప భూములు ఆక్రమణకు గురైనట్లు పలువురు రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. పూర్తి విచారణ చేపట్టి బాధిత రైతులకు న్యాయం చేయాలని కోరారు.

ఇదీ చూడండి:800కిలోల గంజాయి స్వాధీనం... ముగ్గురు అరెస్టు

ABOUT THE AUTHOR

...view details