ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సరకులన్నీ కుళ్లిపోతున్నాయి.. ఆదుకోండి సార్​!

కరోనా వైరస్ నేపథ్యంలో విశాఖ జిల్లా నర్సీపట్నంలో వ్యాపారం సన్నగిల్లింది. ఇందిరా మార్కెట్​ రెడ్​జోన్ కావడంతో నిత్యావసర సరకులు.. సరైన అమ్మకాలు లేక కుళ్లిపోతున్నాయి. తమ వ్యాపారం దెబ్బతింటోందని.. ప్రభుత్వమే తమను కాపాడాలని వ్యాపారులు కోరుతున్నారు.

farmers problrms for vegetables Rotting in narsipatnam market yard dueto lockdown in visakhapatnam
farmers problrms for vegetables Rotting in narsipatnam market yard dueto lockdown in visakhapatnam

By

Published : May 10, 2020, 1:51 PM IST

నర్సీపట్నం ఇందిరా మార్కెట్ ప్రాంతం రెడ్​జోన్​లోకి వెళ్లిన కారణంగా.. ఆ మార్కెట్ పూర్తిగా మూత పడింది. ఈ క్రమంలో చిల్లర వర్తకులు ఎక్కడికక్కడే వీధి దుకాణాలు వేసుకుంటూ కాలం గడుపుతున్నప్పటికీ... తమకు ప్రత్యామ్నాయం లేని కారణంగా నర్సీపట్నానికి సమీపంలోని పెద్ద బొడ్డేపల్లి వద్ద వ్యవసాయ మార్కెట్ యార్డులో అద్దె ప్రాతిపదికన వ్యాపారం కొనసాగిస్తున్నారు.

అయితే ఇందిర మార్కెట్​లో ఉన్న సదుపాయాలు వ్యవసాయ మార్కెట్​లో లేకపోవడంతో తాము అనేక కష్టాలకు గురవుతున్నామని... సరుకులు కుళ్లిపోయి నష్టపోతున్నామని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదోకోవాలని వేడుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details