ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సమష్టి కృషితో నీటి సమస్యలు పరిష్కారం.. - Farmers repairing Mangalore dam canal

విశాఖ జిల్లా కోనాం జలాశయం దిగువ ఆయకట్టు రైతులు, విశాఖ డైయిరీ సంయుక్తంగా ఆనకట్టు గండికి తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు. సమష్టి కృషితో మండువేసవిలో నీటి సమస్య లేకుండా పరిష్కరించున్నారు.

Konam Reservoir
కోనాం జలాశయం

By

Published : Apr 15, 2021, 11:22 AM IST

విశాఖ జిల్లా చీడికాడ మండలం కోనాం మధ్యతరహా జలాశయం పరిధిలోని బొడ్డేరు నదిపై అప్పలరాజుపురం సమీపంలోని మంగళాపురం ఆనకట్టకు గతేడాది గండి పడింది. ఈ కారణంగా ఆనకట్టు పరిధిలో ఉన్న చీడికాడ, బుచ్చయ్యపేట మండలాలకు చెందిన పలు గ్రామాలకు సాగునీరు అందలేదు. ఫలితంగా పంటలు ఎండిపోతూ.. పశువులకు తాగటానికి నీరు కూడా లభించలేదు. దీంతో ఈ ప్రాంత ఆయకట్టు రైతులు, విశాఖ డైయిరీ సంయుక్తంగా నిధులను సమకూర్చారు. ఆనకట్టు గండికి తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టి, సాగునీటిని కాలువలకు మళ్లించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details