ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడి ఓ వివాహిత మృతి చెందింది. ఈ ఘటన విశాఖ జిల్లా అనకాపల్లి మండలం పిసినికాడ వద్ద చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన సింధు విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని తన పుట్టింటికి వెళ్లి పూరీ-తిరుపతి రైల్లో తిరుగు ప్రయాణమైంది. అనకాపల్లి దాటాక బాత్రుంకి వెళ్లిన సింధు ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడింది. బాత్రుంకి వెళ్లిన సింధు కనిపించకపోవటంతో ఆమె కుటుంబ సభ్యులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అనకాపల్లి సమీపంలోని రైల్వే ట్రాక్ పై యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి విషయాన్ని రైల్వే పోలీసులకు తెలియజేశారు. కుటుంబ సభ్యులు వచ్చి మృతదేహాన్ని పరిశీలించి సింధుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రైలు నుంచి జారిపడి.. వివాహిత మృతి - train
విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలో ఓ వివాహిత ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతి చెందింది. మృతురాలు కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన సింధుగా గుర్తించారు.
వివాహిత మృతి