విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలం తిమిరాం గ్రామంలో కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు తెదేపా ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు అందజేశారు. మాజీ ఎంపీటీసీ సభ్యుడు చిటిమిరెడ్డి సూర్యనారాయణ ఆయన సతీమణి ఎంపీపీ అభ్యర్ధి సత్యవేణి నిత్యవసరాలు సమకూర్చారు. మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు చేతుల మీదుగా ప్రజలకు అందజేశారు. 450 కుటుంబాలకు ఇంటింటికీ వెళ్లి నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.
పేదకుటుంబాలకు కూరగాయల పంపిణీ - కూరగాయల పంపిణీ
లాక్డౌన్ కారణంగా పేద కుటుంబాలకు పూట గడవడం కష్టంగా మారింది. ఈ నేపధ్యంలో విశాఖపట్నం జిల్లా తిమిరాం గ్రామంలో తెదేపా ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
పేదకుటుంబాలకు కూరగాయల పంపిణీ