విశాఖ మన్యంలో కరోనా చాప కింద నీరులా వ్యాపిస్తుంది. సామాన్య జనంతో పాటు ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడ్డుతున్నారు. తాజాగా మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్‌కు కొవిడ్ సోకింది. కొవిడ్ పాజిటివ్ రావడంతో ఆయన హోమ్ క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నారు.
మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కు కరోనా పాజిటివ్
విశాఖ జిల్లా పాడేరులో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 18 మందికి కరోనా సోకగా.. వీరిలో మాజీ మంత్రి కిడారి శ్రావణ్ ఒకరు. కరోనా పాజిటివ్ వచ్చిన ఆయన హోంక్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.
మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కు కరోనా
పాడేరులో ఇప్పటికే 750 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం 151 మందికి పరీక్షలు చేయగా 18 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది. ఇప్పటి వరకూ కరోనాతో ఐదుగురు మృత్యువాత పడ్డారు. కరోనా సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి :పరిపాలనను మూడు ముక్కలాటగా మార్చారు: చంద్రబాబు