విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ రూపొందించిన బృహత్తర ప్రణాళికపై ప్రజల నుంచి భారీ సంఖ్యలో అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో..ప్రభుత్వం వీఎంఆర్డీఏ మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేసింది. ముందు పేర్కొన్న మాస్టర్‌ప్లాన్ నుంచి ఎండాడలో 80 అడుగుల రోడ్డు ప్రతిపాదన తొలగించింది. సర్వే నెంబర్లు, 98, 100, 101, 102, 103 లలో దాదాపు అర కిలోమీటరు రహదారి తొలగించారు. పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి తొలగింపునకు సంబంధించిన జీవో జారీ చేసింది.
వీఎంఆర్డీఎ మాస్టర్ ప్లాన్ నుంచి ఎండాడలో 80 అడుగుల రోడ్డు తొలగింపు - విశాఖ జిల్లా తాజా వార్తలు
వీఎంఆర్డీఎ మాస్టర్ ప్లాన్ నుంచి ఎండాడలో 80 అడుగుల రోడ్డును తొలగించారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇచ్చిన విజ్ఞప్తిని పరిశీలించిన ప్రభుత్వం.. ఆ మేరకు రహదారిని మాస్టర్ ప్లాన్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
వీఎంఆర్డీఎ మాస్టర్ ప్లాన్ నుంచి ఎండాడలో 80 అడుగుల రోడ్డు తొలగింపు