విశాఖ జిల్లా అనకాపల్లిలో 81వ వార్డు వైకాపా అభ్యర్థి పీలా సౌజన్యని గెలిపించాలని కోరుతూ స్థానిక ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతి ప్రచారం చేశారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెదేపా నేత, మాజీ మంత్రి బొండా ఉమామహేశ్వర రావు పార్టీ అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 36వ డివిజన్లో తెదేపా బలపరిచిన సీపీఐ అభ్యర్థి వీరభద్ర రావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. డివిజన్ లోని ప్రజలను కలిసి స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు.