యూకే నుంచి కరోనా పాజిటివ్‌తో రాజమహేంద్రవరానికి వచ్చిన ఓ మహిళతో ఏపీ ఎక్స్‌ప్రెస్ బోగీలో ప్రయాణించిన విశాఖ వాసులు ఎనిమిది మందిని గుర్తించి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ముగ్గురు అనకాపల్లిలోని ఓ లాడ్జిలో ఉండగా గుర్తించారు. ఒకరిది మన్యం ప్రాంతం. మిగిలిన వారిలో ఇద్దరు నగరంలోని వైద్యుల కుటుంబీకులు. వీరందరి స్వాబ్ నమూనాలు సేకరించి శుక్రవారం ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా కొవిడ్ నెగిటివ్ నిర్ధరణ అయినట్లు ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పీవీ సుధాకర్ వెల్లడించారు. కొత్త రకం వైరస్ ప్రభావం వీరిపై ఉందా అనేది తేల్చేందుకు పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆఫ్ వైరాలజీ ప్రయోగశాలకు వీరి నమూనాలు పంపాల్సిన అవసరం లేదని భావించారు. అయితే అందరినీ విశాఖ కేజీహెచ్‌లోని క్వారంటైన్‌కు తరలించారు. వీరిని ఇక్కడే ఉంచాలా, హోం క్వారంటైన్‌కి పంపాలా అన్న అంశాన్ని జిల్లా కలెక్టర్ నిర్ణయిస్తారన్నారు. కాగా జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు కొత్తగా 28 కొవిడ్ కేసులు నమోదయ్యాయని డాక్టర్ సుధాకర్ తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 58,718 మంది డిశ్చార్జి అయ్యారన్నారు. కొవిడ్ ఆసుపత్రుల్లో 284 మంది చికిత్స పొందుతున్నారని చెప్పారు.
అధికారులు అప్రమత్తం