కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా రైళ్లలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గడం వల్ల కొన్ని ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్టు తూర్పుకోస్తా రైల్వే వెల్లడించింది. సికింద్రాబాద్ - విశాఖ - సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న రైలు ఈనెలాఖరు వరకు రద్దయింది. యశ్వంతాపుర్ - దనపూర్ మధ్య సమ్మర్ స్పెషల్ ఒక మార్గంలోనే నడుస్తుందని అధికారులు వెల్లడించారు. హౌరా - వాస్కోడాగామ - హౌరా, హౌరా - హైదరాబాద్ - హౌరా సమ్మర్ స్పెషల్ రైళ్లు మాత్రం యథావిధిగా ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నడుపుతామని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎకె త్రిపాఠీ వెల్లడించారు.
ఆ మార్గంలో ప్రత్యేక రైళ్లు రద్దు.. - east coast railway latest news
ప్రయాణికుల సంఖ్య తగ్గటంతో కొన్ని ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు తూర్పుకోస్తా రైల్వే వెల్లడించింది. సికింద్రాబాద్ - విశాఖ - సికింద్రాబాద్ ప్రత్యేక రైళును ఈ నెలాఖరు వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ప్రత్యేక రైళ్లు రద్దు