లాక్‌డౌన్ కారణంగా వాహనాలు తిరగక... ఆహారం దొరక్క వలస కూలీలు అల్లాడుతున్నారు. పొట్టకూటి కోసం వచ్చి... తిరిగి వెళ్లే మార్గం లేక ఒడిశా కూలీలు ఇక్కడే చిక్కుకుపోయారు. ఒడిశా సరిహద్దుల్లో ఉన్న తమ కుటుంబసబ్యుల దగ్గరకు వెళ్లడానికి నిశ్చయించుకున్నారు. విశాఖ నుంచి సీలేరు మీదుగా తమ స్వగ్రామాలకు బయలు దేరారు. 220 కిలోమీటర్ల నడకలో భాగంగా... ఆకలితో ఆగిపోయిన వారికి విశాఖ జిల్లా డౌనూరు, చింతపల్లి, ఆర్వీ నగర్ వద్ద పోలీసులు.. ఆరోగ్య సిబ్బంది వారికి భోజన ఏర్పాట్లు చేశారు. సుమారు 16 మంది భవన కార్మికులకు.. లాక్‌డౌన్ నేపథ్యంలో పనులు లేవని.. ఇంటికి వెళ్లిపోవాలని యజమానులు సూచించారు. వీరికి రావాల్సిన బకాయిలను చెల్లించినా... వాహనాలు లేకపోవడంతో కాలిబాట పట్టారు. మార్గమధ్యంలో తమ ఆకలిబాధలు తెలుసుకుని.. పోలీసులు, వైద్యసిబ్బంది.. మూడు చోట్ల భోజనాలు ఏర్పాటు చేశారని బాధితులు తెలిపారు.
వలస కూలీల క్షుద్బాధ తీర్చిన పోలీసులు, డాక్టర్లు - విశాఖలో కరోనా వార్తలు
లాక్‌డౌన్ కారణంగా విశాఖలో చిక్కుకున్న వలస కూలీల ఆకలిని... పోలీసులు, వైద్య సిబ్బంది తీర్చారు. 220 కిలోమీటర్లు నడిచి వచ్చిన వారికి మూడు చోట్ల భోజన సదుపాయం కల్పించారు.
due to lockdown police who provided meals for migrant workers at visakhapatnam