కరోనా వ్యాపిస్తున్న వేపథ్యంలో విశాఖ ప్రజలు లాక్డౌన్ని పాటిస్తున్నారు. తమకిచ్చిన వెసులుబాటు సమయంలోనే.. బయటకు వచ్చి.. కావలిసిన అత్యవసర, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. పోర్ట్, పెట్రో రిఫైనరీ సంస్థలు, ఫార్మా సంస్థలు, పనిచేస్తూ ఉండటం వల్ల మద్దిలపాలెం, తాడిచెట్లపాలెం, ఎన్ఏడీ కూడలిలో కాస్త జన సంచారం కనిపిస్తోంది. ప్రజలకు కేటాయించిన సమయంలో తప్ప.. మిగిలిన వేళల్లో బయటకు వస్తే కేసులు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
విశాఖలో కట్టుదిట్టంగా లాక్డౌన్ - విశాఖలో కరోనా వార్తలు
కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా విశాఖ వాసులు లాక్డౌన్ని పాటిస్తున్నారు. తమకు కేటాయించిన సమయాల్లోనే బయటకి వస్తున్నారు. ప్రభుత్వం కొన్ని సంస్థలకు వెసులుబాటు కల్పించిన కారణంగా ప్రధాన కూడళ్లలో కాస్త రద్దీ కనిపిస్తోంది.
due to CORONA lockdown traffic appears in visakhapatnam