ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుళాయిలున్నా పనిచేయవు... తాగునీటి కష్టాలు తీరవు.. - విశాఖ జిల్లా చిదొడ్డిగల్లులో తాగునీటి కష్టాలు

బిందెడు మంచి నీళ్ల కోసం ఆ మహిళలు కిలోమీటర్ల దూరాన ఉన్నా వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్నారు. ఊరిలో కుళాయిలు ఉన్నా అవి పనిచేయకపోవటంతో నీరు కోసం నడక తప్పడంలేదు. విశాఖ జిల్లా చినదొడ్డిగల్లులో తాగునీటి కోసం గ్రామస్థలు అవస్థలివి.

drinking water problem in chinadoddigallu vizag district
తాగునీటి కష్టాలు

By

Published : Jul 8, 2020, 12:48 PM IST

విశాఖ జిల్లా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లులో నెల రోజులుగా తాగునీరు రావడంలేదని గ్రామస్థులు అంటున్నారు. ఈ గ్రామంలో సుమారు 5వేలం మంది ఉంటున్నారు. వీరి తాగునీటి అవసరాల కోసం సమీప కొండ ప్రాంతంలో 3 బోర్లు వేసి.. కుళాయిల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు.

అయితే అవి పాడైపోవటంతో గత నెలరోజులుగా తాగునీరు రావడంలేదు. బిందెడు నీళ్లకోసం మహిళలు వ్యవసాయ బోర్లను, బావులను ఆశ్రయిస్తున్నారు. అధికారులు స్పందించి తమకు నీరు సరఫరా చేయాలని కోరుతున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details