విశాఖపట్నంలో నాయీ బ్రాహ్మణులకు స్థానిక యువకులు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. నాయీ బ్రాహ్మణుల యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మాధవ్ హాజరై నిత్యవసరాలు అందించారు. అనంతరం సెలూన్ షాప్‌లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను దాత చరణ్ వివరించారు.
విశాఖలో నాయీబ్రాహ్మణులకు నిత్యావసరాలు పంపిణీ
లాక్‌డౌన్‌తో పేదలు, కార్మికులు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి అవస్థను గమనించి సహాయం చేసేందుకు పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. వారికి తోచినంత తోడ్పాటును అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
విశాఖలో నాయీబ్రాహ్మణులకు నిత్యావసరాలు పంపిణీ