విశాఖ మన్యంలో గ్రామ వాలంటీర్ల ఇంటర్వ్యూలకు నిరుద్యోగులు అధిక సంఖ్యలో వస్తున్నారు. జి.మాడుగుల మండలంలోని కిల్లంకోటకి లక్ష్మి, దేవరపల్లికి వరలక్ష్మి.. గతంలో సర్పంచిగా పని చేశారు. వారే.. ప్రస్తుతం గ్రామ వాలంటీర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఇది అక్కడి అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది.
గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూకు... అప్పటి సర్పంచి గారు!?
గ్రామ వాలంటీర్ల ఇంటర్వ్యూలలో అధికారులకు వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. విశాఖ మన్యంలో ఈ ఉద్యోగానికి పోటీ తీవ్రంగా ఉంది. అయితే... ఒకప్పుడు ఆ గ్రామానికి సర్పంచిగా పనిచేసి వారే... ప్రస్తుతం ఇంటర్వ్యూకు రావటం అధికారులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
volunteer-interviews
గూన గొయ్యి గ్రామంలో వాలంటీర్ పోస్టుకు రెండు దరఖాస్తులే వచ్చాయి. ఇంటర్వ్యూకి వచ్చిన ఓ వ్యక్తి... తనకంటే రెండో వ్యక్తే సమర్థుడని, ఆ ఉద్యోగం అతనికే ఇవ్వాలని కోరారు. అతని నిజాయితీకి అందరూ అభినందనలు తెలిపారు.