ఆస్తి పన్ను పెంపును నిరసిస్తూ తెదేపా, జనసేన, సీపీఎం కార్పొరేటర్లు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. తెదేపా, జనసేన, సీపీఎం కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ఆస్తి పన్ను పెంపును నిరసిస్తూ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. నిరసనకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ధర్నాకు దిగిన కార్పొరేటర్లను అరెస్టు చేయగా.. అక్కడి వాతావరణం మరింత గందరగోళంగా మారింది. ఈ ఘటనతో జీవీఎంసీ కౌన్సిల్ హాల్‌లో పాలకవర్గం వెంటనే సమావేశమైంది. ఆస్తి పన్ను పెంపుపై ప్రత్యేక చర్చను చేపట్టింది.