విశాఖ ఎల్జీ పాలీమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన బాధిత చిన్నారులను డీజీపీ గౌతం సవాంగ్ పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు మనో ధైర్యాన్ని ఇచ్చారు. వారికీ ఉత్తమమైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించి... చిన్నారుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని వారికీ ఏ సమస్యలు రాకుండా చూసుకుంటారని... చిన్నారుల తల్లిదండ్రుకలకు హామీ ఇచ్చారు. ప్రాణాలకు తెగించి సేవలందించిన పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు. ప్రజా రక్షణ కోసం పోలీసులు ఎప్పుడూ ముందుండాలని పిలుపునిచ్చారు.
గ్యాస్ లీకేజీ బాధిత చిన్నారులకు డీజీపీ పరామర్శ - విశాఖ గ్యాస్ లీకేజీలో బారిన పడ్డ పిల్లలను పరిశీలించిన డీజీపీ
విశాఖ ఎల్జీ పాలీమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత చిన్నారులను... డీజీపీ గౌతం సవాంగ్ పరామర్శించారు. ప్రభుత్వం వారిని అన్ని విధాలా ఆదుకుంటుందని వారి తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.
గ్యాస్ లీకేజీ బాధిత చిన్నారులను పరామర్శించిన డీజీపీ గౌతం సవాంగ్