వైకాపా ముఖ్యనేత విజయసాయిరెడ్డి విశాఖలో భూకబ్జాలకు పాల్పడుతున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ చేసిన ఆరోపణలపై జీవీఎంసీ డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల అభివృద్ధికి విజయసాయిరెడ్డి ఎనలేని కృషి చేస్తుంటే… మూర్తి యాదవ్ ఇలాంటి ఆరోపణలు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. గతంలో సీఎం జగన్, విజయసాయిరెడ్డిని.. మూర్తియాదవ్ పొగిడిన రోజులు మర్చిపోయి… ఇలా మాట్లాడటం బాధాకరమన్నారు.
'ఉత్తరాంధ్ర అభివృద్ధికి విజయసాయిరెడ్డి కృషి చేస్తున్నారు' - visakha mudasarlova park
వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ చేసిన ఆరోపణలను... విశాఖ డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు ఖండించారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల అభివృద్ధికై విజయసాయి ఎనలేని కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
విశాఖ డిప్యూటీ మేయర్ సమావేశం
Last Updated : Jun 8, 2021, 1:25 PM IST