ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైద్యుల చొరవ.. కరోనా వైరస్​ సోకిన గర్భిణీకి ప్రసవం

కరోనా వైరస్​ సోకిన గర్భిణీ విశాఖ స్టీల్ ప్లాంట్ జనరల్ ఆస్పత్రిలో స్త్రీకి వైద్యులు ప్రసవం చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా..పీపీఈ కిట్లు లేకుండా కరోనా రోగికి ప్రసవం చేస్తే తమ పరిస్థితి ఏంటని నర్సుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

delivery to corona patient at vishaka steel plant
వైద్యుల చొరవ.. కోవిడ్​తో ఉన్న గర్భిణీకి ప్రసవం

By

Published : Aug 6, 2020, 9:56 AM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ జనరల్ ఆస్పత్రిలో కొవిడ్‌తో ఉన్న గర్భిణీకి వైద్యులు ప్రసవ చేశారు. కరోనా ఉందని తెలిసినా ప్రసవం చేసేందుకు వైద్యుడు చొరవ తీసుకున్నారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

పీపీఈ కిట్లు లేకుండా కరోనా రోగికి ప్రసవం చేస్తే తమ పరిస్థితి ఏంటని నర్సుల ఆందోళన చెందుతున్నారు. కొవిడ్‌తో ఉన్న బాలింతను ఆస్పత్రి నుంచి తరలించాలని నర్సుల డిమాండ్ చేశారు. తమకు పీపీఈ కిట్లు, ఇతర సామగ్రి అందుబాటులో ఉంచాలని కోరారు.

ఇదీ చదవండి: అమరావతి బృహత్​ ప్రణాళికపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా

ABOUT THE AUTHOR

...view details