విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో దసరా ఉత్సవాలు మొదలయ్యాయి. క్షేత్రపాలకుడైన త్రిపురాంతక స్వామి ఆలయంలో అమ్మవారు రోజుకో అలంకరణతో భక్తులకు దర్శనమివ్వనున్నారని ఆలయ అర్చకులు తెలిపారు. నవరాత్రిలో భాగంగా రోజూ ప్రత్యేక పూజలు జరుగుతాయని చెప్పారు.
అపన్న సన్నిధానంలోనే ఈ ఏడాది దసరా మహోత్సవాలు - dasara celebrations in simhadri
విశాఖజిల్లా సింహాచలంలో దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కరోనా నిబంధనల కారణంగా ఈ ఏడాది కొండపైన స్వామి సన్నిధానంలోనే ఉత్సవాలు జరుగుతాయని ఆలయ పూజారులు తెలిపారు.
సింహాద్రి అప్పన్న ఆలయం
విజయదశమి నాడు సింహగిరిపై మహోత్సవం జరిపిస్తామని పూజారులు ప్రకటించారు. ఏటా ఉత్సవం కొండ దిగువున పూల తోటలో జరిగేదని.. కరోనా కారణంగా ఈ సంవత్సరం స్వామి సన్నిధానంలో జరుగుతుందన్నారు. కొవిడ్ నిబంధనలతో కొంతమంది భక్తులకు మాత్రమే దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పారు.